Samantha: ఇక‌పై ఆ విష‌యం గురించి మాట్లాడ‌ను.. స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Samantha: ఇక‌పై ఆ విష‌యం గురించి మాట్లాడ‌ను.. స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
x

Samantha: ఇక‌పై ఆ విష‌యం గురించి మాట్లాడ‌ను.. స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Highlights

అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన ఆమె, నాలుగేళ్ల వివాహ బంధం అనంతరం విడిపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Samantha: స‌మంత అంటే ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌, అక్కినేని ఇంటి కోడ‌లు, సౌత్ ఇండియాలో క్రేజ్ హీరోయిన్ ఇవి గుర్తొచ్చేవి కానీ ఎప్పుడైతే నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుందే అప్ప‌టి నుంచి విడాకుల అంశ‌మే గుర్తొస్తుంది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన ఆమె, నాలుగేళ్ల వివాహ బంధం అనంతరం విడిపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా సమంతపైనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కానీ కాలక్రమేణా ఆ విషయాన్ని అందరూ మరిచిపోయారు.

ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు సమంత చేసే కొన్ని వ్యాఖ్యలు, ఇన్‌స్టాలో పెట్టే స్టోరీలు ట్రోలింగ్‌కు కారణమయ్యాయి. ఇక విడాకుల తరువాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టిన సమంత, చికిత్సల కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంది. ఇప్పుడు ఆమె 'శుభం' అనే సినిమా ద్వారా కొత్తగా నిర్మాతగా మారింది.

ఇది ఆమె నిర్మించిన తొలి సినిమా కావడం విశేషం. మే 9న ఈ చిత్రం విడుదల కానుండటంతో, ఇటీవల వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సమంత, ఈ సినిమా విశేషాలు పంచుకోగా... ఇకపై తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే ఆలోచన లేదని స్పష్టంగా తేల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే స‌మంత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉన్నారన్న వార్తలు కూడా వినిపించాయి. వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్నార‌ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిపై సామ్ ఇంత వ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories