Rashmika Mandanna: వివాదంలో రష్మిక.. ఫైర్ అవుతోన్న కన్నడ ప్రజలు.. అసలేమైందంటే..?
Rashmika Mandanna: సినీ తారలు వివాదాల్లో నిలవడం సర్వసాధారణమైన విషయం. అయితే వివాదాలకు దూరంగా ఉండే నటి రష్మిక మందన తాజాగా విమర్శలు ఎదుర్కొంటోంది.
Rashmika Mandanna: వివాదంలో రష్మిక.. ఫైర్ అవుతోన్న కన్నడ ప్రజలు. అసలేమైందంటే..?
Rashmika Mandanna: సినీ తారలు వివాదాల్లో నిలవడం సర్వసాధారణమైన విషయం. అయితే వివాదాలకు దూరంగా ఉండే నటి రష్మిక మందన తాజాగా విమర్శలు ఎదుర్కొంటోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ రష్మిక చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటనేగా..
రష్మిక ఇటీవల నటించిన బాలీవుడ్ చిత్రం ఛావా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్‌లో మంచి టాక్‌తో దూసుకుపోతోంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కాగా తాజాగా ముంబయిలో నిర్వహించిన ఛావా సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘‘నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.
ఇదిగో ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. రష్మిక చేసిన వ్యాఖ్యలను పలువురు కన్నడవాసులు తప్పుపడుతున్నారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ‘విరాజ్‌పేట్ (రష్మిక సొంతూరు) హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చింది? ఈ విషయం మాకు తెలియలేదు..!’, ‘వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు సొంతూరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏంటి?’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే రష్మిక కెరీర్ కన్నడ చిత్రంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీతో ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఆ తర్వాత ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తెలుగులో వరుస విజయాలను అందుకున్న ఈ బ్యూటీ పుష్పతో నేషనల్ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాల్లో నటించే అవకాశం సంపాదించుకుంటూ దూసుకుపోతోంది.