టెన్త్ ఫెయిల్.. జీవితంలో గోల్ లేదు.. హీరో ఎలా అయ్యానంటే..
లీడర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి.
లీడర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుపాటి. పదో తరగతి తప్పిన రానా యాక్టర్ గా ఎలా మారడానే సంగతులు #RD10 పేరుతో స్పెషల్ మీడియోను రూపొందించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యడు ఈ రానా.. ఆ తర్వాత కొంత కాలానికే విలన్ పాత్రలు చేశారు. ఒక నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. దీంతో రానా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి సరిగ్గా పదేళ్లు అవుతుంది.
దీంతో తాజాగా సురేశ్ ప్రొడెక్షన్స్ #RD10 ఛాప్టర్1 వీడియోను ఒకదాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియోలో దగ్గుబాటి సురేశ్‌బాబు, అలాగే రానా బాబాయ్ విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ క్రిష్, నాగ్ అశ్విన్ ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్, అల్లుఅర్జున్, నాగచైతన్య రానా నటను ప్రశంసించారు.
'మా నాన్న మెకానికల్ ఇంజనీర్, వెంకీ బాబాయ్ ఎంబీఏ చదువుకున్నవారు. కానీ, నేను పదో తరగతి ఫెయిలయ్యాను. చరణ్, బన్నీ నాకు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. కెరీర్ పై వాళ్లకు అవగాహన ఉంది. నాకు గోల్ అంటూ లేకుండా ఉన్నాననిపించేది. సినిమా అంటే ఇష్టమని తెలుసు. . సినిమానే వృత్తిగా చేసుకోవచ్చని, జీవితం అంతా సినిమాలోనే జీవించవచ్చని ఒకానొక సమయంలో అర్థం చేసుకున్నాను వీఎఫ్‌ఎక్స్ బిజినెస్ ప్రారంభించాను.'అని రానా చెప్పారు
రానా వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా మారి 85 సినిమాలకు పనిచేశారు. 2006లో విడుదలైన మహేశ్ బాబు 'సైనికుడు' సినిమాకి బెస్ట్ విఎఫ్‌ఎక్స్ విభాగంలో నంది అవార్డును అందుకున్నారు. రానా తన స్నేహితుడు ప్రకాశ్‌తో కలిసి 'బొమ్మలాట' అనే సినిమాని నిర్మించారు. 'బొమ్మలాట' సినిమా జాతీయ అవార్డును అందుకుంది. నటుడిగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత స్టంట్స్ లో శిక్షణ తీసుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ చిత్రాలు చూసి తెలుగు నేర్చుకున్నారు.