Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్2లో బోల్డ్ కంటెంట్ ఉందా?
Rana Naidu Season 2 Review: విక్టరీ వెంకటేష్, దక్కుపాటి రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్2 పైనే ఇప్పుడు అందరి ఆశలు. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు.
Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్2లో బోల్డ్ కంటెంట్ ఉందా?
Rana Naidu Season 2 Review: విక్టరీ వెంకటేష్, దక్కుపాటి రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్2 పైనే ఇప్పుడు అందరి ఆశలు. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన రానానాయుడు సీజన్1 కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అందరి చూపులు సీజన్2 పై ఉన్నాయి. జూన్ 13న నెట్ ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రారంభం.
రానానాయుడు సీజన్1 అమెరికన్ క్రైమ్ డ్రామా యాక్షన్ సిరీస్. వెంకటేశ్,రానాలతో పాటు సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఫస్ట్ సీజన్ స్టోరీ ఏంటంటే రాణా నాయుడు తన క్లయింట్లు వదిలిపెట్టిన సమస్యలను సరిచేస్తూ ఉంటాడు. ఈ పనిని అతను చాలా సీరియస్‌గా తీసుకుని చేస్తుంటాడు. దీని చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఇందులో క్రైమ్, థ్రిల్లింగ్ ఎక్కువగా ఉండటం వల్ల రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.
అయితే ఈ సిరీస్‌కు విమర్శలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఇందులో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ విమర్శించారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని సీజన్ 2లో బోల్డ్ కంటెంట్ తగ్గించినట్టు తెలుస్తుంది. సెన్సార్ తర్వాత కూడా కొంత బోల్డ్ కంటెంట్ తగ్గినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ సిరీస్‌లో కథకు అవసరమైన అంశాలన్నీ ఉన్నాయి. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. యాక్షన్, థ్రిల్లింగ్, డైలాగులు అన్నీ ప్రేక్షకులను ఆశ్యర్యపరచనున్నాయి. దక్షిణాది వెబ్ సిరీస్‌లో ప్రముఖ హీరోలు యాక్ట్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఆడియన్స్ కూడా మొదటి సిరీస్‌ని ఇంట్రెస్ట్‌గా చూసారు. ఇప్పడు సీజన్2 ని కూడా అంతే ఆదరిస్తారని రానా నాయుడు టీం కోరుకుంటుంది.
సీజన్ 1లో ఏం జరిగిందనేది చూపిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో 3 నిమిషాలు ఉంది. సీజన్ 1 స్టోరీ మొత్తం ఈ మూడు నిమిషాల్లో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మొదటి సీజన్ చూడకపోయినా ఈ వీడియో చూస్తే సీజన్ 1 కథ ఏంటో అర్ధమైపోతుంది. సీజన్1 చూసేంత టైం లేని వాళ్లు ఈ వీడియో చూసేసి ఇప్పుడొచ్చిన సీజన్ 2 చూసేయొచ్చు.