Rana Naidu 2: రానా నాయుడు2లో బోల్డ్ సీన్స్ ఉంటాయా.? రానా ఏమన్నారంటే
Rana Naidu 2: 2023లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలై సంచలన విజయం సాధించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ ఇప్పుడు రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. రానా దగ్గుబాటి – వెంకటేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ తొలి భాగానికి భారీగా వ్యూస్ వచ్చాయి.
Rana Naidu 2: రానా నాయుడు2లో బోల్డ్ సీన్స్ ఉంటాయా.? రానా ఏమన్నారంటే
Rana Naidu 2: 2023లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలై సంచలన విజయం సాధించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ ఇప్పుడు రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. రానా దగ్గుబాటి – వెంకటేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ తొలి భాగానికి భారీగా వ్యూస్ వచ్చాయి. అయితే, ఇందులో బోల్డ్ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి.
రానా నాయుడు సీజన్ 2 జూన్ 13న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సీజన్‌లో బోల్డ్ సీన్లు తగ్గించారనే వార్తలపై రానా తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మా సిరీస్‌కి ట్రోలింగ్ వచ్చింది అన్నది నిజమే. కానీ ఇందులో నేను, వెంకటేశ్ నటించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సౌత్‌లో పూర్తిగా తెలుగు మూలకథతో రూపొందిన వెబ్‌సిరీస్‌లకు ఇది ఆరంభం అని చెప్పవచ్చు. ‘మీర్జాపూర్’ వంటివి తెలుగు డబ్బింగ్ రూపంలో వచ్చినా, ‘రానా నాయుడు’లా నేటివిటీ నెటివిటీ ఉండడంతో ప్రజల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.
వెంకటేశ్ తరచూ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించారు. కానీ రానా నాయుడులో ఆయన చేసిన పాత్ర చాలా డార్క్ అండ్ ఇంటెన్స్ గాను ఉండటంతో ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ‘‘కెరీర్ ఆరంభంలో ఆయన కొన్ని నెగెటివ్ రోల్స్ చేసినా, తర్వాత ఆ పాత్రల్ని ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ ఈ సిరీస్‌తో ఆయనలోని మరో కోణాన్ని చూశారు. ఇది పూర్తిగా ఆయన నిజ జీవితానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మా మధ్య స్నేహాన్ని బలపరిచింది,’’ అని రానా వివరించారు.
సిరీస్ మేకర్స్ ప్రకారం, రెండో సీజన్ కథలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అదనంగా యాక్షన్, థ్రిల్ వంటి అంశాలు ఉండబోతున్నాయని తెలిపారు. ‘‘ఇది కేవలం బోల్డ్ కంటెంట్‌తో నడిచే కథ కాదు. ఎమోషన్స్, హ్యూమన్ కనెక్ట్‌తో కూడిన డీప్ డ్రామా. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభూతినిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.