దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన రానా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తాచాటుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో భళ్లాలదేవుడు రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. ఇక రానా తాజాగా నటించిన బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. కాగా.. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమా తెలుగు తమిళ హిందీ బాషల్లో రుపొందిస్తు్న్నారు. తెలుగులో 'అరణ్య' తమిళంలో 'కాదన్' హిందీలో 'హాథీ మేరే సాథీ', గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. హిందీలో ఈ సినీమాకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. మానవులు-జంతువుల ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి 'బన్ దేవ్' పాత్రలో నటిస్తున్నారు.
మంగళవారం విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పెరిగిన గెడ్డంతో ఒళ్లంతా గాయాలతో అడవి జంతువుల మద్య రానా ఉగ్ర రూపంతో రానా కలిపిస్తారు. ఈ సినిమాలో జోయా హుస్సేన్, శ్రియా పిల్లావుంకర్, విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్ పలువురు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత రసూల్ సౌండ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రభు సోలోమాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా... ఈ సినిమా మూడు భాషల్లో ఏప్రిల్ 2న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తుంది.
Release date finalized... #HaathiMereSaathi to release on 2 April 2020... Will also release simultaneously in #Tamil and #Telugu... Stars #RanaDaggubati... Directed by Prabu Solomon... Produced by Eros International. pic.twitter.com/WHS9PTighw
— taran adarsh (@taran_adarsh) February 10, 2020