నగరిలో మంత్రి రోజాను కలిసిన రమ్యకృష్ణ
Ramya Krishnan: రమ్యకృష్ణను సన్మానించిన రోజా
నగరిలో మంత్రి రోజాను కలిసిన రమ్యకృష్ణ
Ramya Krishnan: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజాని ఆమె స్నేహితురాలు, ప్రముఖ సినీ నటి శ్రీమతి రమ్య కృష్ణ కలిశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో నగరిలోని మంత్రి ఆర్.కె.రోజా గారి స్వగృహంలో స్నేహపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణను రోజా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి మునిసిపాలిటి, వడమాలపేట, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.