RC-16: రామ్ చరణ్ RC16 రిలీజ్ అయ్యేది ఆ పండుగకే.. ట్వీట్ వైరల్

ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో RC-16 మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Update: 2025-03-05 10:47 GMT

 రామ్ చరణ్ RC16 రిలీజ్ అయ్యేది ఆ పండుగకే.. ట్వీట్ వైరల్

RC16: రామ్ చరణ్ రీసెంట్‌గా నటించిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. అయితే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో RC-16 మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC-16 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నటీనటులు, సిబ్బంది, సాంకేతిక నిపుణుల తేదీలు షెడ్యూల్ ప్రకారం ట్రాక్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు ఈ పండగకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ శివన్న లుక్ టెస్ట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆయన కురుణడ చక్రవర్తి పాత్రలో కనిపిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఆయన షూట్‌లో పాల్గొననున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో జరుగుతుంది. ఇక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. అలాగే జామా మసీదు వద్ద కూడా కొన్ని సీన్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

శరవేగం షూటింగ్ జరుపుకుంటున్న RC-16 సినిమాను దీపావళి నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Tags:    

Similar News