Ramcharan Vamshipaidipally Combination Again: రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ రిపీట్?

ramcharan and vamshipaidipally combination again: చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.. మున్నా, బృందావనం, ఎవడు చిత్రాలు వంశీ పైడిపల్లికి మంచి పేరును తీసుకువచ్చాయి.

Update: 2020-07-12 08:55 GMT

Ramcharan Vamshipaidipally Combination Again: చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.. మున్నా, బృందావనం, ఎవడు చిత్రాలు వంశీ పైడిపల్లికి మంచి పేరును తీసుకువచ్చాయి. ఇక గత ఏడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో స్టార్ డైరెక్టర్ లలో వంశీ ఒకడిగా నిలిచాడు. ఇక మహర్షి సినిమా తరవాత మహేష్ బాబుతో మరో సినిమాని ప్లాన్ చేశాడు వంశీ.. కథ చర్చలు అన్ని ముగిశాయి. మహేష్ కూడా వంశీతో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. కానీ ఏమైందో ఏమో కానీ మహేష్ తో వంశీ సినిమా ఆగిపోయింది.

ఇక మరో హీరోతో వంశీ సినిమాని చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఒకే అయినట్టుగా తెలుస్తోంది.. వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కొత్త స్టోరీ లైన్‌ రామ్‌చరణ్‌కు తెగ నచ్చిందట. దీంతో ప్రస్తుతం ఫుల్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారట వంశీ. ఇక ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎవడు చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.. మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.

Tags:    

Similar News