Mahesh Babu about Saroj Khan Death: స‌రోజ్ ఖాన్ మ‌ర‌ణ‌వార్త‌తో నా గుండె ప‌గిలింది: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు

Mahesh Babu about Saroj Khan Death: స‌రోజ్ ఖాన్ మ‌ర‌ణ‌వార్త‌తో నా గుండె ప‌గిలింది: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు
x
File Photo
Highlights

Mahesh Babu about Saroj Khan Death: బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.

Mahesh Babu about Saroj Khan Death: బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.. లెజండ‌రీ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్(71) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు.. ఈ విషయాన్ని ఆమె కూతురు నిర్ధారించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలుపుతుంది. నిమ్ర‌త్ కౌర్, కునాల్ కోహ్లీ, రితేష్ దేశ్ ముఖ్, మ‌నోజ్ బాజ్‌పాయ్, సునీల్ గ్రోవ‌ర్, అక్ష‌య్ కుమార్ త‌దిత‌రులు స‌రోజ్ ఖాన్‌తో ఉన్న జ్ఞాప‌కాలను పంచుకున్నారు..

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. స‌రోజ్ ఖాన్ మ‌ర‌ణ‌వార్త‌తో నా గుండె ప‌గిలింది. రాబోయే త‌రాల‌కి ఆమె స్పూర్తి. స‌రోజ్ ఖాన్ మృతికి నా సంతాపం . కుటుంబ స‌భ్యుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

ఇక సరోజ్ ఖాన్ టాలీవుడ్ లో బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, మ‌హేష్ వంటి టాప్ హీరోల‌తో క‌లిసి పని చేసింది.డోలా రే డోలా, ఏక్ దో తీన్‌, ధ‌క్ ధ‌క్ ఇలా ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి ఆమెకొరియోగ్ర‌ఫీ చేశారు. స‌రోజ్‌కి భ‌ర్త సోహ‌న్‌లాల్‌, కొడుకు హ‌మీద్ ఖాన్, కూతురు హీనా ఖాన్‌, సుఖైన ఖాన్ ఉన్నారు.

స‌రోజ్ ఖాన్ తన 40 ఏళ్ళ కెరియ‌ర్‌లో 2000 కి పైగా సినిమాలు చేశారు. ఆమెకి అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆమెను ముద్దుగా ఆమె అభిమానులు ది మ‌ద‌ర్ ఆఫ్ డ్యాన్స్ లేదా కొరియోగ్ర‌ఫీ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటారు. స‌రోజ్ ఖాన్ అంత్య‌క్రియ‌లు ఈ రోజు మలాద్ చౌకి సమీపంలోని స్మశానవాటికలో జరగనున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories