ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బుధవారం బ్రూస్లీ 80వ జయంతి పురస్కరించుకొని ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ చిత్రాన్ని తీయనున్నట్ల ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ బ్రూస్లీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్లర్లో వరుస ట్వీట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ బ్రూస్లీలా కావాలని ఉంటుందని ఆయన ఎత్తులేకపోయినా అందరికీ బ్రూస్లీలా అవ్వాలనే కోరిక ఉంటుందన్నారు.
నాకు కరాటే, కుంగ్‌ఫూ లాంటివి తెలియదు. బ్రూస్లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా పేరు విన్నప్పుడు ఆ చిత్రం తప్పకుండా చూడాలని అనిపించిందన్నారు. కానీ నేను ఎప్పుడైతే ఆ సినిమా చూడడానికి 7 కిలోమీటర్లు సైకిల్ మీద థియేటర్‌కు వెళ్లి ఎంటర్ ది డ్రాగన్ చిత్రాన్ని17సార్లు చూశానని తెలిపారు. ఆ తర్వాత రీఎంటర్ ది డ్రాగన్ చిత్రాన్ని ఎక్కువసార్లు చూశానన్నారు. బ్రుస్లీ 32 ఏళ్ల వయస్సులోనే చనిపోవడం చాలా విచారకరం. బ్రూస్లీ గురించి ఆలోచించాక పర్‌ఫెక్ట్ వ్యక్తికి చావు ఉంటుందని తెలిసిందని అన్నారు. సాధారణ మనుషుల్లా బ్రూస్లీ సమాధిలోకూడా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మార్షాల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తుంటారని నమ్మకం ఉందని అన్నారు.
ఇండో-చైనా సంయుక్త నిర్మిస్తున్న చిత్రం ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ ఈ చిత్ర టీజర్ బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ డిసెంబర్ 13న బ్రూస్ లీ సొంతం నివాసంమైన చైనాలోని ఫోషన్ సిటీలో విడుదల చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ చిత్ర విషయమై చైనీస్ నిర్మాతతో ఒప్పందం చేసుకున్న ఫోటోను పోస్టు చేశారు.
INTERNATIONAL TRAILER of ENTER THE GIRL DRAGON will be released on December 13 th In BRUCE LEE's home town FOSHAN CITY in CHINA #EnterTheGirlDragon pic.twitter.com/MkyK7HssSl
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2019
A piece I wrote on the Eve of the 80th birth anniversary of BRUCE LEE #EnterTheGirlDragon it's titled BRUCE LEE PUNCHED ME https://t.co/YXNr4jvgk1 pic.twitter.com/lpozTVJkka
— Ram Gopal Varma (@RGVzoomin) November 27, 2019