RGV: అహంకారంతో నా కళ్లు నెత్తికెక్కాయి.. రామ్‌ గోపాల్‌ వర్మ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

Update: 2025-01-20 15:27 GMT

RGV: అహంకారంతో నా కళ్లు నెత్తికెక్కాయి.. రామ్‌ గోపాల్‌ వర్మ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

RGV about Satya movie: దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రొటీన్‌గా సాగుతోన్న ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని మలుపు తిప్పిన వ్యక్తిగా వర్మ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నాడు వర్మ. రామ్‌గోపాల్‌ వర్మ కెరీర్‌లో బెస్ట్‌ మూవీస్‌లో సత్య ఒకటి. 27 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనంగా చెప్పొచ్చు. కాగా తాజాగా ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. ఇకపై దర్శకుడుగా తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నానని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారు. '27 ఏళ్ల తర్వాత మొదటిసారి ‘సత్య’ చూశాను. నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే కేవలం సినిమా కోసం కాదు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తొచ్చాయన్నారు.

ఒక సినిమాను చిత్రీకరించడమంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. సినిమా తీసిన తర్వాత ఇతరులు దాని గురించి ఏం చెబుతారనేది కూడా ముఖ్యమే. నేను తీసిన చిత్రాలు హిట్‌ అయినా.. కాకపోయినా.. నేను పనిలో నిమగ్నమై ముందుకుసాగుతున్నాను. రెండు రోజుల క్రితం ‘సత్య’ సినిమా చూసినప్పుడు ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి' అని రాసుకొచ్చారు.

చాలా రోజుల తర్వాత ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని అనిపించిందన్న వర్మ.. అలాగే ఈ చిత్రంలోని భావోద్వేగం వల్ల తనకు కన్నీళ్లు రాలేదని, ఇంత గొప్ప జానర్‌ సినిమాను నేనే తీశాను అనే ఆనందానికి వచ్చాయని అర్థమైందన్నారు. ‘సత్య’ లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాననే అపరాధభావంతో నాకు కన్నీళ్లు వచ్చాయి’ అని రాసుకొచ్చారు.

ఇక సినిమాలు ఇచ్చిన విజయం అహంకారంతో తన కళ్లునెత్తికెక్కాయన్న వర్మ.. సత్య’ గొప్పతనం రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసేవరకూ అర్థం కాలేదన్నారు. రంగీలా, సత్యలాంటి చిత్రాలు ఇచ్చిన వెలుగులో నా కళ్లు మూసుకుపోయాయన్న వర్మ, తనకు ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశానని, అతి తెలివితో అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు, ఇలా అర్థంపర్థంలేని విషయాలతో కథ, కథనాలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా సినిమాలు తీశానన్నారు. సాధారణ కథతోనూ మంచి ఎలివేషన్‌ ఉన్న సినిమాలు చేయొచ్చని, కానీ తాను అలా చేయలేకపోయానన్నారు.

సత్య తీసిన తర్వాత తాను ఎన్నో సినిమాలు చేశానన్న వర్మ.. అవి కూడా ‘సత్య’ అంత బాగుంటాయా అని తనను ఎవరూ అడగలేదన్నారు. కనీసం ఇలా తనను తాను కూడా ప్రశ్నించుకోలేకపోవడం దారుణన్న వర్మ, ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు ‘సత్య’ను కచ్చితంగా చూడాలనే నియమాన్ని పెట్టుకున్నానన్నారు. ఇప్పటివరకు తీసిన చిత్రాలకు ఈ నియమాన్ని పాటించినట్లైతే 90 శాతం చిత్రాలు తెరకెక్కించేవాడిని కాదేమో అన్నాడు.

చివరగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నానన్న వర్మ తన జీవితంలో ఇంకా సగభాగం మిగిలే ఉందని, దానిని గౌరవంగా పూర్తిచేయాలనుకుంటున్నా అన్నాడు. సత్య లాంటి సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నాను. ఇదే సత్యం. ఈ సత్యాన్ని నా సినిమా ‘సత్య’పై ప్రమాణం చేసి చెబుతున్నాను అంటూ పెద్ద పోస్ట్‌ చేశారు. 

Tags:    

Similar News