Ram Gopal Varma: పెద్ద మనిషి మరణానికి విలువ ఇవ్వరా..?
Ram Gopal Varma: కృష్ణంరాజుకు టాలీవుడ్ సరైన నివాళి ఇవ్వలేదు
Ram Gopal Varma: పెద్ద మనిషి మరణానికి విలువ ఇవ్వరా..?
Ram Gopal Varma: ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.
నేను కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, పవన్ కల్యాణ్ కు, మహేశ్ బాబుకు, బాలయ్యకు, ప్రభాస్ కు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే... రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది' అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళికి కూడా ఈ ట్వీట్ ను ట్యాగ్ చేశారు.