Ram Charan: ఇదీ రామ్ చరణ్ రేంజ్.. ఓటీటీ హక్కులకే రూ. 100 కోట్లు
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’, గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందుతున్న ఒక పవర్‌ఫుల్ డ్రామా. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
Ram Charan: ఇదీ రామ్ చరణ్ రేంజ్.. ఓటీటీ హక్కులకే రూ. 100 కోట్లు
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’, గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందుతున్న ఒక పవర్‌ఫుల్ డ్రామా. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ఒప్పందం విలువ రూ.105 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఓటీటీ హక్కులకే ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడం సినిమాపై ఉన్న అంచనాలకు సాక్ష్యంగా చెప్పొచ్చు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా రామ్ చరణ్ మరొక్కసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఈ స్థాయిలో డిజిటల్ హక్కులు అమ్ముడవడం తెలుగు సినిమాల్లో అరుదైన విషయం. ఒక్క ఓటీటీ హక్కుల ద్వారానే రూ. 100 కోట్ల మార్కెట్ చేస్తే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.