Ram charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన వారి ఇంట్లో రకరకాల పక్షులు, జంతువులు కూడా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వారిద్దరికీ పెట్స్ అంటే చాలా ఇష్టమట. వారికి రైమ్ అనే కుక్క పిల్లతోపాటు బాద్ షా, కాజల్, బ్లేజ్ అనే గుర్రాలు కూడా ఉన్నాయి. వాటన్నింటితోపాటు కుట్టి అనే ఆఫ్రికన్ జాతికి చెందిన చిలుక కూడా ఉంది.
అయితే ఈ మధ్యే ఆ కుట్టి జుబ్లిహిల్స్ ఏరియాలోని రోడ్ నెంబర్ 25లో మిస్ అయినట్లుగా ఉపాసన ఇన్ స్టాలో వెల్లడించారు. ఎక్కడైనా కనిపిస్తే చెప్పండంటూ షేర్ చేశారు. ఆ పోస్టు చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ వాళ్లు ఆ చిలుకను వెతికి పట్టుకుని తిరిగి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అందించినట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.
ఆ చిలుక ఇంటికి వెళ్లి రామ్ చరణ్ ను చూడగానే ఆయన భుజంపై వెళ్లి కుర్చుంది. కుట్టికి రామ్ చరణ్ కు మధ్య ఎంత బాండింగ్ ఉంటే అది వెళ్లి ఆయన భుజం మీద కూర్చొంటుంది. కుట్టిని మళ్లీ ఇంటికి వచ్చేలా సహాయం చేసిన వహ్రా , ప్రియ, యానిమల్ వారియర్ టీమ్ సభ్యులందరికీ ఈ సందర్భంగా ఉపాసన థ్యాంక్స్ చెప్పారు.
యానిమల్ వారియర్స్ తమ సోషల్ మీడియాలో ఆ కుట్టిని ఎలా రెస్య్కూ చేశారనేది వివరంగా చెప్పారు. కుట్టి తిరిగి రావడంపై చరణ్, ఉపాసన ఎంతో సంతోషించారని వారిద్దరికీ యానిమల్ వెల్ఫేర్ పైనున్న ఇష్టాన్ని ప్రశంసించారు.