కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అంటున్న రామ్ చరణ్
Ram Charan: పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ పై రియాక్ట్ అయిన రామ్ చరణ్
కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అంటున్న రామ్ చరణ్
Ram Charan: ఈ మధ్యనే "ఆర్.ఆర్.ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమాని నిర్మించిన రామ్ చరణ్ ఆ సినిమాలో ఒక కీలక పాత్ర కూడా పోషించారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు చెర్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అని అడగగా రామ్ చరణ్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు.
"ఇప్పటికే పలుసార్లు మల్టీస్టారర్ సినిమా గురించి కొన్ని పాయింట్లు డిస్కస్ చేసాము. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి తో ఒక సినిమా చేస్తాను. నేనే ఆ సినిమాని స్వయంగా నిర్మిస్తాను కూడా. ప్రస్తుతం నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాను. శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాను" అని క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. ఎప్పటి నుంచో మెగా హీరోలతో మల్టీస్టారర్ సినిమా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రామ్ చరణ్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.