RC15 Movie: అప్పుడే సినిమా విడుదల అంటున్న రామ్ చరణ్

2023లో విడుదల కాబోతున్న రామ్ చరణ్ సినిమా

Update: 2021-12-03 10:25 GMT

RC15 Movie: అప్పుడే సినిమా విడుదల అంటున్న రామ్ చరణ్

RC15 Movie Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఒక రాజకీయ నాయకుడు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాది కాకుండా 2023లో విడుదలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా పలు భాషల్లో విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కి కొంత సమయం పడుతుందని అందుకనే విడుదల 2023లో మాత్రమే జరుగుతుందని రామ్ చరణ్ అన్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత రామ్ చరణ్ సరసన కియార అద్వానీ నటిస్తున్న రెండవ సినిమా ఇది.

Tags:    

Similar News