Acharya Movie: ఉగాది కానుకగా.. చెర్రీ, పూజాహెగ్డేల రొమాంటిక్ ఫోటో రిలీజ్
Acharya Movie: ఆచర్య మూవీ నుంచి చరణ్ పూజతో ఉన్న రొమాంటిక్ ఫోటో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Acharya Movie:(Twitter)
Acharya Movie: సోషల్ మేసెజ్ తో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి దేవాదాయ శాఖ ఆఫీసర్ గాను, నక్సలైట్ గాను రెండు విభిన్నపాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక చిరు సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ పాత్ర ఆచార్యలో దాదాపు 40నిమిషాలకు పైగా ఉండనుందని అంటున్నారు. ఇటీవలే చిరు- చరణ్ లపై కీలక సన్నివేశాలను పూర్తి చేశారు కొరటాల.
ఈ మధ్య రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో చిరు, చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గెటప్ లో కనిపించరు. తాజాగా ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో రామ్ చరణ్- పూజాహెగ్డే ఉన్నారు. చరణ్ పూజతో ఉన్న రొమాంటిక్ ఫోటోను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా ప్రేమ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఆచార్య లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు చరణ్.