Ram Charan New Movie: జెర్సీ డైరెక్టర్ తో రాం చరణ్?

Ram Charan New Movie: ప్రస్తుతం రాం చరణ్ 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Update: 2021-04-07 10:58 GMT

రాం చరణ్, గౌతం (ఫొటో: ది హన్స్ ఇండియా)

Ram Charan New Movie: ప్రస్తుతం రాం చరణ్ 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, ఈ రెండు సినిమాల తరువాత నేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేయనున్నాడని తెలిసిందే.

వీటి తరువాత తను చేయబోయే సినిమాలు ఏంటని ఇంత వరకు తెలియలేదు. తాజాగా రాం చరణ్ కొత్త మూవీపై టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. రాం చరణ్ 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ టిన్ననూరి తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జెర్సీ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.

"మల్లి రావా" చిత్రంతో జెర్సీ డైరెక్టర్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నానితో 'జెర్సీ' సినిమా చేశాడు. "జెర్సీ" మూవీ ప్రస్తుతం ఈ డైరెక్టర్ తోనే హిందీలో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

కాగా, "ఆచార్య" లో సిద్ధగా రాం చరణ్ కనిపించనున్నాడు. అలాగే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్'చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News