Ram Charan: త్రిపుల్ ఆర్ సినిమా యూనిట్ సభ్యులకు రాంచరణ్ కానుక
Ram Charan: *ఊహించని కానుకతో ఆనందంతో సినీ యూనిట్ సభ్యులు *ఆటోగ్రాఫ్ తో 35 మందికి బంగారు కాయిన్ల బహూకరణ
Ram Charan: త్రిపుల్ ఆర్ సినిమా యూనిట్ సభ్యులకు రాంచరణ్ కానుక
Ram Charan: హీరో రాంచరణ్ త్రిపుల్ ఆర్ సినిమా యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరచాడు. అల్పాహారంకోసం ఇంటికి రమ్మని సరదాగా గడిపారు. సినిమా యూనిట్లో తనకు సహకరించిన వారిని ఆహ్వానించిన రాంచరణ్ అల్పాహారవిందునిచ్చి ఇంటికెళ్లే సమయంలో బంగారు నాణేలను బహూకరించి సంతృప్తపరచారు. ఊహించని గిఫ్ట్ తో ఆనందంతో మునిగిపోయారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందికి గొల్డ్ కాయిన్ కానుకగా ఇచ్చారు. సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.