Coolie: రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఖరారు..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ నుంచి పెద్ద అప్‌డేట్ వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది.
Coolie: రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఖరారు..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ నుంచి పెద్ద అప్‌డేట్ వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. అయితే తాజాగా మూవీ యూనిట్ ట్రైలర్ తేదీని ప్రకటించింది. ముందుగా ట్రైలర్ ఉండదని అనౌన్స్ చేసిన లోకేష్.. హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నారు. ఆగస్ట్ 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో రజినీతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రత్యేకంగా నాగార్జున విలన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కూలీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఎల్‌సీయూ వరల్డ్‌లో వచ్చే ఈ చిత్రానికి భారీ బడ్జెట్‌ను కళానిధి మారన్ వెచ్చిస్తున్నారు.
ట్రైలర్ డేట్ తెలిసినప్పటికీ.. విడుదల సమయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆగస్ట్ 2న ట్రైలర్ టైమ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ బిజినెస్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రమోషన్లూ జోరుగా మొదలవనున్నాయి.
Coolie ట్రైలర్‌తో మరెన్నో అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లనుందన్న ఆసక్తి సినీప్రియుల్లో నెలకొంది.