Rajamouli: మహేష్ బాబు కోసం బాలీవుడ్ నటుడు రంగంలోకి దింపనున్న జక్కన్న

Update: 2021-08-11 12:25 GMT

Rajamouli - Mahesh Babu: (Photo: The Hans India)

Mahesh Babu - Rajamouli New Movie: ఈ మధ్యన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న మొదటి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

ఈ సినిమాని రాజమౌళి ఒక మల్టీస్టారర్ సినిమాగా తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు తో పాటు మరో హీరో కూడా ముఖ్యం పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే రెండవ హీరో పాత్ర కోసం రాజమౌళి బాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో ని ఎంపిక చేయాలని చూస్తున్నారట. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక యాక్షన్ స్క్రిప్టు రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి ఇంకా మరి కొంత సమయం ఉంది కాబట్టి "ఆర్ ఆర్ ఆర్" సినిమా పనులు పూర్తయిన తర్వాత మహేష్ బాబు సినిమా పైన దృష్టి పెడదామని రాజమౌళి అనుకుంటున్నారట.

Tags:    

Similar News