Raja Saab Teaser Update: రాజాసాబ్ టీజర్ వస్తుందట! SKN ఇచ్చిన అప్‌డేట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
Raja Saab Teaser Update: ప్రభాస్ 'రాజాసాబ్' టీజర్ త్వరలో రాబోతోంది. హారర్, స్టైల్ మిక్స్‌తో ఫ్యాన్స్‌కు పండగే!
రాజాసాబ్ టీజర్ వస్తుందట! SKN ఇచ్చిన అప్‌డేట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
The Raja Saab Movie: డార్లింగ్ ఫ్యాన్స్‌కు స్టైలిష్ హారర్ ట్రీట్!
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ‘రాజాసాబ్’ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే ఓ డౌట్ ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది – “మారుతి లాంటి డైరెక్టర్ ఓ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేయగలడా?” అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఇదికూడా నిజమే – మారుతికి ఇటీవలి కాలంలో పెద్దగా హిట్స్ లేవు. అందుకే ‘రాజాసాబ్’ అనగానే కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ "ఇదేం సినిమాబా!" అంటూ డిసప్పాయింట్ అయ్యారు. కానీ, షూటింగ్ ఎలాంటి హడావుడీ లేకుండా సైలెంట్‌గా జరగడం, ఆ లోపల నుంచి వచ్చిన కొన్ని లీక్స్‌తో మాత్రం హైప్ మళ్లీ పుంజుకుంది.
గతేడాది సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ మేకోవర్ ఫొటో ఫ్యాన్స్‌ను షాక్‌లోకి నెట్టింది. "ఇదేనా మన డార్లింగ్?" అని ఒక్కసారిగా ఎవ్వరూ నమ్మలేకపోయారు. తర్వాత వచ్చిన ‘గ్లింప్స్’ వీడియో మారుతిపై ఉన్న నెగటివిటీని చెరిపేసింది. "జై మారుతి!" అంటూ ట్వీట్లు చేసుకునే స్థాయికి వెళ్లిపోయారు ఫ్యాన్స్. అలాంటి స్టైలిష్ లుక్‌లో ప్రభాస్‌ను చూడడం అంటే ఓ పండగే!
ఇప్పుడు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ముందు ఈ మూవీ ఏప్రిల్ 10న రాబోతోందని చెప్పారు కానీ, VFX పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.
ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే – బేబి నిర్మాత SKN వెల్లడించిన వివరాల ప్రకారం, ‘రాజాసాబ్’ టీజర్ ఇంకో రెండు వారాల్లో రిలీజ్ కానుంది! ఈ వార్తతో డార్లింగ్ అభిమానుల ఆనందానికి అవధులే లేవు.
తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో హారర్ సీన్లు అస్సలు రొటీన్‌గా ఉండబోవు. “వరల్డ్ సినిమా హిస్టరీలో కూడా ఇలాంటి హారర్ ఎప్పుడూ చూడలేదు” అని నిర్మాత విశ్వ ప్రసాద్ elevation ఇచ్చిన మాటలే దీని బలాన్ని చెబుతున్నాయి.
ఇంతకీ, ఇది పేరుకే హారర్ అని బయటకి కనిపించే సినిమాలకంటే పూర్తి భిన్నంగా ఉండబోతోందన్నమాట. అన్నీ చూస్తే, ఈసారి మారుతి ఏదో బాంబే పేల్చబోతున్నాడేమో అనిపిస్తోంది!