Viral News: నమ్మకం పోతే రాదు.. సమంతతో డేటింగ్ వార్తల వేళ రాజ్ భార్య పోస్ట్
Viral News: బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె "నమ్మకం" అనే అంశంపై పంచుకున్న స్టోరీ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తాజాగా శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. "నమ్మకం అనేది ప్రపంచంలోనే విలువైనది. అది ఒక్కసారి పోతే, దాన్ని తిరిగి పొందడం అసాధ్యం – ఎంత ధనం ఉన్నా చాలు కాదుష అనే సందేశాన్ని షేర్ చేశారు. రాజ్ నిడిమోరు, సమంత మధ్య సంబంధం ఉందన్న ప్రచారం జోరుగా నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్యామాలి చేసిన పోస్టుపై చర్చ మొదలైంది.
శ్యామాలి చివరిసారిగా 2023లోనే రాజ్‌తో కలిసి ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కనిపించకపోవడమే కాకుండా, శ్యామాలి తరచూ పంచుకుంటున్న పోస్టులు వారి మధ్య దూరాన్ని సూచిస్తున్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వారిద్దరూ విడిపోయారన్న వార్తలూ చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తలపై ఇప్పటివరకు రాజ్ గానీ, శ్యామాలి గానీ స్పందించలేదు.
ఈ మధ్య శ్యామాలి ఇంకొక స్టోరీలో కర్మ సిద్ధాంతం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "కాలమే అన్నిటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం ఇస్తుంది. ఈ బ్రహ్మాండం శాంతిగా చూస్తూ ఉంటుంది". అనే పోస్ట్ చేసింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుందో కాలమే నిర్ణయించాలి.