Rahul Dev : తనకంటే 18ఏళ్లు చిన్నదైన హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న మాస్ విలన్
నటుడు రాహుల్ దేవ్ పేరు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. మాస్, మున్నా, ఎవడు వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు.
Rahul Dev : తనకంటే 18ఏళ్లు చిన్నదైన హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న మాస్ విలన్
Rahul Dev : నటుడు రాహుల్ దేవ్ పేరు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. మాస్, మున్నా, ఎవడు వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఈ నటుడు తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచారు. తనకంటే 18 ఏళ్లు చిన్నదైన మరాఠీ నటి ముగ్ధా గాడ్సేతో రాహుల్ దేవ్ డేటింగ్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, గత కొన్నేళ్లుగా ఈ జంట లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని సమాచారం.
సెప్టెంబర్ 27, 1968న ఢిల్లీలో జన్మించిన రాహుల్ దేవ్, తన బాల్యం నుంచే ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. ఆయన తండ్రి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసేవారు. రాహుల్ దేవ్ 2000వ సంవత్సరంలో ఛాంపియన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అందులో విలన్ పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత, ఆయన తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాలలో నటించారు. దురదృష్టవశాత్తూ 2009లో ఆయన భార్య రీనా దేవ్ క్యాన్సర్‌తో మరణించారు. ఆమె మరణం తర్వాత, రాహుల్ కొన్ని సంవత్సరాలు ఒంటరిగానే, తన కొడుకుతో కలిసి జీవించారు.
ఒంటరిగా ఉన్న సమయంలోనే రాహుల్ దేవ్ మోడల్, నటి అయిన ముగ్ధా గాడ్సేను కలిశారు. ముగ్ధా ఆయన కంటే 18 ఏళ్లు చిన్నవారు. వారిద్దరి మధ్య మొదలైన పరిచయం కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారింది. అనంతరం వారి అభిప్రాయాలు కలవడంతో, ఆ స్నేహం ప్రేమగా మారింది. వీరు 2013వ సంవత్సరం నుండి లివ్-ఇన్ సంబంధంలో కొనసాగుతున్నారు. ఈ జంట ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ముగ్ధా గాడ్సే మరాఠీ చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటి. మోడల్‌గా కూడా పనిచేసిన ఆమె, అజయ్ దేవగన్, సంజయ్ దత్ వంటి స్టార్ నటులతో కలిసి పనిచేసింది. ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ అనే హిందీ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు.