Radhika Apte: ఓటీటీపై ఆంక్షలా.. ఫైరవుతోన్న రాధిక ఆప్టే

Radhika Apte: ఓటీటీలపై కేంద్రం ప్రభుత్వం ఆంక్షలు పెట్టడాన్ని ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే ఖండించారు.

Update: 2021-03-27 14:15 GMT

రాధికా ఆప్టే (ఫొటో ట్విట్టర్)

Radhika Apte: ఓటీటీలపై కేంద్రం ప్రభుత్వం ఆంక్షలు పెట్టడాన్ని ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే ఖండించారు. ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోందని, ఆంక్షలు విధిస్తే ఎన్నో కొత్త ఆలోచనలకు బ్రేకులు వేసినట్లునని వాపోయారు.

కరోనా కాలంలో థియేటర్లు మూసివేతతో.. ఓటీటీ వినియోగం బాగా పెరిగింది. చిన్న సినిమాలు, స్టార్‌ హీరోలు కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.. అయితే సినిమాల్లో ఉ‍న్నట్లు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ లేదు. దీంతో ఓటీటీ పేరిట అశ్లీలం పెరుగుతుందని ఆందోళనలు పెరిగిపోయాయి. దానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నియమాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

'ఓటీటీ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కొత్త కొత్త నటులు, దర్శకులు ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇది చాలా మంచి ప్లాట్‌పామ్‌. కానీ, కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. మున్ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి' అని అసహనం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News