Radhe Shyam - Aashiqui Aa Gayi Song Teaser: "రాధేశ్యామ్" హిందీ వెర్షన్ సాంగ్ టీజర్ రిలీజ్

Update: 2021-11-29 07:43 GMT

Radhe Shyam - Aashiqui Aa Gayi Song Teaser: "రాధేశ్యామ్" హిందీ వెర్షన్ సాంగ్ టీజర్ రిలీజ్

Radhe Shyam - Aashiqui Aa Gayi Song Teaser: పాన్ ఇండియా స్టార్.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్" చిత్రం నుండి తాజాగా Aashiqui Aa Gayi. హిందీ వెర్షన్ సాంగ్ టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. One Heart.. Two HeartBeats ఒకే సినిమానే అయినా కూడా రెండు భాషలకు కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన సంగీతం అందించబోతున్నారని దీని అర్థం. భారత చలన చిత్ర చరిత్రలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.

ఈ నేప‌థ్యంలో 29 న‌వంబ‌ర్ సాయంత్రం 7 గంటలకు "రాధేశ్యామ్" నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ టీజ‌ర్ ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేయనున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో మిథున్ సంగీతాన్ని అందిస్తుండగా.., తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

Full View


Tags:    

Similar News