Pushpa 2: పుష్పలో బన్నీ అంతలా గుట్కా ఎందుకు నమిలాడో తెలుసా.? సుకుమార్‌ మాస్టర్‌ ప్లాన్‌

Pushpa 2: అల్లు అర్జున్‌ కెరీర్‌లో, ఆ మాటకొస్తే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అత్యంత వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది పుష్ప2 చిత్రం.

Update: 2025-03-17 06:40 GMT

Pushpa 2: పుష్పలో బన్నీ అంతలా గుట్కా ఎందుకు నమిలాడో తెలుసా.? సుకుమార్‌ మాస్టర్‌ ప్లాన్‌

Pushpa 2: అల్లు అర్జున్‌ కెరీర్‌లో, ఆ మాటకొస్తే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అత్యంత వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది పుష్ప2 చిత్రం. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఊహకందని విజయాన్ని అందుకుంది. మొదటి భాగానికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప2 చిత్రం మరింత భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకుపైగా రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

గతంలో ఉన్న ఎన్నో రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ 38 సెకన్ల ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో బన్నీ డైలాగ్స్‌తో పాటు, సినిమాకి సంబంధించిన హైలైట్స్ చూపించారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయమూ వెలుగులోకి వచ్చింది. సినిమాలో బన్నీ నోట్లో ఎప్పుడూ గుట్కా ఉంటూ కనిపిస్తాడు. స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బన్నీ ఇలా మాస్‌ లుక్‌లో కనిపించినా ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

కాగా అసలు బన్నీ ఇంతలా గుట్కా నమలడానికి కారణం ఉంటన్న దానిపై తాజాగా దర్శకుడు సుకుమార్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నార్త్ ఇండియాలో గుట్కా ఎక్కువగా వాడుతుంటారు. దీంతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే ఉద్దేశంతోనే బన్నీ పాత్రను ఇలా డిజైన్‌ చేసినట్లు తెలిపారు. బన్నీ డైలాగ్‌ డెలివరీతో పాటు డ్రెస్సింగ్ స్టైల్‌ అన్ని నార్గ్‌ ఇండియా ప్రజలను ఆకర్సించేలా రూపొందించాడు. ఇందుకు అనుకున్నట్లే ఈ సినిమా నార్త్‌లో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పుష్ప2 సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను బిహార్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News