Pushpa 2 OTT Release Date: ఓటీటీలోకి పుష్ప2.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి, ఎక్కడ చూడొచ్చంటే..!
Pushpa 2 OTT Release Date: ఇటీవల టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నీ సినీ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సినిమా ఏదైనా ఉందా అంటే అది పుష్ప2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Pushpa 2 OTT Release Date: ఇటీవల టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నీ సినీ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సినిమా ఏదైనా ఉందా అంటే అది పుష్ప2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది.
బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కినెట్టి మరీ పుష్ప2 కలెక్షన్ల వర్షం కురిపించింది. డిసెంబర్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 1896 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీలోడ్ వెర్షన్ పేరుతో మరో 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే థియేటర్లలో బంపర్ హిట్‌గా నిలిచిన పుష్ప2 మూవీ ఇకపై ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. సినీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. పుష్ప2 మూవీ జనవరి 30వ తేదీ నుంచి ఓటీటీలోకి రానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 3 గంటల 40 నిమిషాల నిడివి ఉన్న వెర్షన్ ఓటీటీలోకి రానుంది.
తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి సినిమా అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే పుష్ప2 డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 100 కోట్లకు సొంతం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న పుష్ప2, ఓటీటీలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.