Pushpa 2 OTT: పుష్ప2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్
Pushpa 2 OTT: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Pushpa 2 OTT: పుష్ప2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్
Pushpa 2 OTT: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్పకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. భారీ బడ్జెట్‌తో, అత్యంత భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినినమా అంచనాలను అందుకోవడంలో పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే ఏకంగా రూ. 1850 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. దీంతో బాహుబలి రికార్డును అధిగమించి దేశంలో అత్యంత వసూళ్లను రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో దంగల్ ఉన్న విషయం తెలిసిందే. సినిమా విడుదలై 45 రోజులు గడుస్తోన్నా ఇప్పటికే కొన్ని చోట్ల పుష్ప2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప2 ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓటీటీకి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం పుష్ప2 చిత్రం 56 రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. నార్త్‌లో ఇప్పటికే పుష్ప2 థియేటర్లలో రన్ కొనసాగుతుండడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప2 డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ. 200 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తెలుగుతో పాటు అన్ని భాషల్లో పుష్ప2 హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి చివరి నాటికి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్తు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓటీటీ ప్రేక్షకులకు చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇవ్వనుందని సమాచారం. పుష్ప2 రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. సుమారు 3:40 నిమిషాల నిడివి ఉన్న సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.