Pushpa 2 movie gangamma jathara scene: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో సినీ ప్రియులు థియేటర్లకు క్యూకడుతున్నారు. ఈ మూవీలో జాతర సీన్ ఫైట్ హైలెట్‌గా నిలిచిందంటున్నారు ప్రేక్షకులు. ఆ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందంటున్నారు. తాజాగా ఓ థియేటర్‌లో జాతర సీన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో తెలిపే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ థియేటర్‌లో పుష్ప2 సినిమాను చూస్తున్న సందర్భంలో ఓ మహిళ అభిమాని పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఆడియన్స్ అందరూ ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పుష్ప 2 మూవీలో తిరుపతి గంగమ్మ జాతర హైలెట్ అని స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ జాతర ఈ మూవీకి ఒక రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ జాతర సీన్‌లో అల్లు అర్జున్ చీర కట్టుకుని పూనకంతో ఊగిపోతూ డ్యాన్స్ చేయడం హైలెట్‌గా నిలిచిందంటున్నారు. థియేటర్‌లలో ప్రతీ ఒక్కరు కూడా సీట్ల నుంచి నిలబడి మరీ బన్నీ నటనకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
అయితే ఇటీవల అన్‌స్టాపబుల్ సీజన్ 4 లో పాల్గొన్న అల్లు అర్జున్.. ఆ టైమ్‌లో సినిమా గురించి బాలయ్యకు వివరిస్తూ ఇప్పటిదాకా మాస్ చూశారు.. ఊర మాస్ చూశారు. పుష్ప2 జాతర మాస్ చూడబోతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. థియేటర్లో పూనకాలు తెప్పిస్తున్న జాతర సీన్ చూస్తుంటే అప్పుడు అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ నిజమే అనిపిస్తోంది.