Pushpa 2 box Office Collection day 2: పుష్ప 2 రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pushpa 2 box Office Collection day 2: అల్లు అర్జున్ నటించిన పుష్ఫ 2 సినిమా మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Update: 2024-12-07 11:15 GMT

Pushpa 2 box Office Collection day 2: పుష్ప 2 రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pushpa 2 box Office Collection day 2: అల్లు అర్జున్ నటించిన పుష్ఫ 2 సినిమా మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 2వ రోజు ఈ మూవీ ఇండియాలో ఏకంగా రూ.90.1 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు రాబట్టింది. రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లలో ఒక్క ఇండియాలోనే రూ.265 కోట్లు వసూలు చేసింది.

పుష్ప 2 సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పటివరకు అతిపెద్ద ఓపెనింగ్ గల భారతదేశ సినిమాలైన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులను పుష్ప 2 మూవీ బ్రేక్ చేసింది. అలాగే హిందీలో కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ కొట్టింది. పుష్ప 2 హిందీలో మొదటి రోజు రూ.72 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. ఇంతవరకు హిందీలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ ఉన్న మూవీగా ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్‌ మూవీని బ్రేక్ చేసి సత్తా చాటింది.

పుష్ప 2 సినిమాకు ఇండియాలో ప్రీమియర్ షో వసూళ్లతో కలిపి మొదటి రోజున రూ.175 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండో రోజున ఇండియాలో పుష్ప 2 మూవీకి రూ.90 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. వాటిలో తెలుగు నుంచి రూ.27 కోట్లు, హిందీ లో రూ.55 కోట్లు, కర్ణాటకలో రూ.6 లక్షలు, తమిళం నుంచి రూ.5.5 కోట్లు, మలయాళం నుంచి 1.9 కోట్లుగా వసూళ్లు వచ్చాయి. అయితే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు పుష్ప సినిమాకు ఇండియాలో 45.14 శాతం కలెక్షన్స్ తగ్గాయి. ఇక రెండు రోజుల్లో పుష్ప2 మూవీకి ఇండియాలో రూ.265 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో తెలుగు నుంచి రూ.118.05 కోట్లు, హిందీ ద్వారా రూ.125.3కోట్లు, తమిళంలో రూ.13.2 కోట్లు, కర్ణాటక నుంచి 1.6 కోట్లు, మలయాళంలో రూ.6.85 కోట్లు ఉన్నాయి. తెలుగు కంటే హిందీ వెర్షన్ ఇప్పటికే ఎక్కువ వసూళ్లు రాబట్టిందని ఓవరాల్ కలెక్షన్స్ సూచిస్తున్నాయి.

ఇక రెండో రోజున తెలుగులో పుష్ప2 సినిమాకు 53 శాతం థియేటర్ ఆక్కుపెన్సీ నమోదైంది. ప్రత్యేకించి నైట్ షోలు అధిక జనాదరణ పొందాయి. హైదరాబాద్ 1009 షోలతో 65 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. బెంగుళూరు 842 షోలతో 48.75 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. హిందీలో ఈ చిత్రం మొత్తం శుక్రవారం 51.65 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. 1523 షోలలో 59.50 శాతం ఆక్యుపెన్సీతో ముంబై ముందజలో ఉంది. ఇక 2021లో విడుదలైన పుష్ప సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప సినిమా అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందించింది.

Tags:    

Similar News