పునర్నవి 'సైకిల్' టిజర్ రిలీజ్..

Update: 2019-11-15 15:48 GMT
cycle teaser

పునర్నవి భూపాలం అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియక పోయి ఉండవచ్చు. కానీ బిగ్‌బాస్‌-3 ద్వారా ఈ భామ బాగా ఫేమస్ అయ్యింది. 2013 లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాలో నటించింది. తాజాగా సైకిల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టిజర్ ని దర్శకడు వివి వినాయక్ విడుదల చేసారు. ఇందులో హీరోగా బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ చిత్రంతో పరిచయం అయిన మహత్‌ రాఘవేంద్ర నటిస్తున్నాడు. .దురదృష్ణవంతుడి లాటరీని అదృష్టవంతుడి జాతకాన్ని అస్సలు నమ్మకూడదు అంటూ ఫన్నీగా టిజర్ సాగుతుంది. కమెడియన్‌ సుదర్శన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాకి ఆట్ల అర్జున్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా గ్రీ మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది..సతీశ్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Full View  

keywords : Punarnavi Bhupalam, Mahath Raghavendra, Cycle Teaser, Biggboss3, Aatla Arjun Reddy

Tags:    

Similar News