Dil Raju: దిల్ రాజు సంచలన కామెంట్స్

నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పైరసీల విషయంలో నటీనటులు తనకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-05 13:26 GMT

దిల్ రాజు సంచలన కామెంట్స్

Dil Raju: సినీ పరిశ్రమలో పైరసీ భూతం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. రూ. కోట్లు ఖర్చు పెట్టి సినిమాను నిర్మిస్తుంటే.. విడుదలైన ఒకటి, రెండ్రోజుల్లోనే సోషల్ మీడియాలో పైరసీ కాపీలు ప్రత్యక్షమవుతున్నాయి. దీని వల్ల సినిమాకు భారీ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన గేమ్ ఛేంజర్, తండేల్ సినిమాల పైరసీలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై తాజాగా నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు.. పైరసీల విషయంలో నటీనటులు తనకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పైరసీపై ఎవరి సినిమా గురించి వారే మాట్లాడతారని.. కొందరు నిర్మాతలైతే శుక్రవారం మాట్లాడితే సోమవారానికి మరిచిపోతున్నారని అన్నారు.

ప్రస్తుతం తెలుగు సినిమాను పైరసీ భూతం పీడిస్తోందన్నారు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే.. అవి పైరసీకి గురై నిర్మాతలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టేందుకు FDC చైర్మన్‌గా తాను ఉద్యమాన్ని లీడ్ చేస్తానని చెప్పారు. దీనికోసం నిర్మాతలు అంతా కలిసి రావాలని.. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉన్నవారు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని నిర్మాత దిల్ రాజు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News