Bandla Ganesh Latest Interview : కరోనా నన్ను పూర్తిగా మార్చేసింది : బండ్ల గణేష్
Bandla Ganesh Latest Interview : లాక్ డౌన్ సమయంలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. దీంతో ఆసుపత్రిలో చికిత్స
Bandla ganesh
Bandla Ganesh Latest Interview : లాక్ డౌన్ సమయంలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అయన కరోనా నుంచి కోలుకొని బయటపడ్డారు.. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గణేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. కరోనా నన్ను పూర్తిగా మార్చేసిందని అన్నాడు. అ సమయంలో నా మైండ్ సెట్ చాలా మారిపోయిందని హాయ్ గా ఎలాంటి గొడవలు లేకుండా బ్రతకాలని ఉందని అన్నాడు..
కరోనా రాకముందు ఇగో అనేది వీటిని తోక్కేసిందని ఇప్పుడు అందరూ గొప్ప వాళ్ళే అందులో మనం ఉండాలి అనే భావన కలిగిందని బండ్ల గణేష్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక రాజకీయాల్లో తనకి అధ్యక్షా అనడం పెద్ద డ్రీం అని కానీ ఎదురైనా అనుభవాల దృష్ట్యా సినిమాల్లో యాక్షన్ కట్ బెటర్ అనిపిస్తుందని అంటూ చెప్పుకొచ్చారు గణేష్.. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవగలనని చెప్పడం ఎన్నికల ప్రచారంలో భాగమేనని అన్నాడు గణేష్..
తెలుగు సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో మొదలగు చిత్రాలు నిర్మించాడు.
ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలపైన ఫోకస్ చేశాడు..