Priyamani: పుట్టే పిల్లలపై కూడా అలాంటి కామెంట్స్‌ చేస్తున్నారు.. ప్రియమణి ఎమోషనల్‌

Priyamani: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది అందాల తార ప్రియమణి. యంగ్ హీరోయిన్లకు పోటీగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.

Update: 2025-02-27 04:39 GMT

Priyamani: పుట్టే పిల్లలపై కూడా అలాంటి కామెంట్స్‌ చేస్తున్నారు.. ప్రియమణి ఎమోషనల్‌

Priyamani: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది అందాల తార ప్రియమణి. యంగ్ హీరోయిన్లకు పోటీగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలో బిజీగా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వివాహం అయినప్పటి నుంచి కొందరు తనను విమర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

2017లో ముస్తాఫా రాజ్‌తో ప్రియమణి ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. 2016లో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆన్‌లైన్‌లో విమర్శలు ఎదురవ్వడం ప్రారంభమైందని తెలిపారు. "నాకు ఎంగేజ్‌మెంట్‌ జరిగితే నా మనుషులంతా ఆనందిస్తారని అనుకున్నాను. వారితో సంతోషకరమైన క్షణాలను పంచుకోవాలనుకున్నా. కానీ, అప్పటి నుంచి నాపై అనవసరమైన ద్వేషం మొదలైంది. లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయి. పిల్లలు పుట్టాక వారిని ఐసిస్‌లో చేరుస్తారా అంటూ కామెంట్లు చేశారు. అవి ఎంతో బాధ పెట్టాయి' అని ప్రియమణి వాపోయింది.

తాను మీడియా పర్సన్‌ని కావడంతో అలాంటివాటిని పట్టించుకోనని, కానీ తన భర్తపై అలాంటి కామెంట్లతో ఎందుకు దాడి చేస్తున్నారంటూ ప్రియమణి ప్రశ్నించింది. అతడి గురించి మీకు వివరాలు తెలియవు, కానీ కామెంట్లు మాత్రం చేసేస్తారు. ఇప్పటికీ నా భర్తతో దిగిన ఫొటో పోస్ట్ చేస్తే పదిలో తొమ్మిది కామెంట్లు మా వివాహం గురించే ఉంటాయన్నారు. వాటివల్ల బాధపడాల్సి వస్తోందని ప్రియమణి చెప్పుకొచ్చారు.

సినిమాల విషయానికి వస్తే... తాజాగా ప్రియమణి 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమాలో కనిపించారు. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జననాయకన్' లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లోనూ కనిపించనున్నారు.

Tags:    

Similar News