Prabhas : ప్రభాస్‌ను హిందీ ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు? స్పిరిట్, ఫౌజీ పై బాక్సాఫీస్ అంచనాలు ఇవే

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన రాబోయే రెండు భారీ చిత్రాలైన ఫౌజీ, స్పిరిట్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2025-10-26 08:30 GMT

Prabhas : ప్రభాస్‌ను హిందీ ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు? స్పిరిట్, ఫౌజీ పై బాక్సాఫీస్ అంచనాలు ఇవే

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన రాబోయే రెండు భారీ చిత్రాలైన ఫౌజీ, స్పిరిట్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాల కోసం హిందీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభాస్ డబ్బింగ్ సినిమాలను హిందీ ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తున్నారు? ఆయన మునుపటి చిత్రాల బాక్సాఫీస్ లెక్కల ప్రకారం స్పిరిట్, ఫౌజీ చిత్రాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ వివరాలతో పాటు ప్రభాస్ రాబోయే సినిమాల విడుదల తేదీల గురించి తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హిందీ డబ్బింగ్ సినిమాల బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే ప్రభాస్‌కు అక్కడ ఎంత క్రేజ్ ఉందో స్పష్టమవుతుంది. బాలీవుడ్ హంగామా అందించిన వివరాల ప్రకారం.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, రాధే శ్యామ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, మిగిలిన అన్ని చిత్రాలు హిందీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ లేదా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

మునుపటి చిత్రాల హిందీ కలెక్షన్లు (నెట్ కలెక్షన్లు)

బాహుబలి – రూ.118.7 కోట్లు

బాహుబలి 2 – రూ.510.99 కోట్లు (బ్లాక్‌బస్టర్)

సాహో – రూ.142.95 కోట్లు (హిట్)

రాధే శ్యామ్ – రూ.19.30 కోట్లు (ఫ్లాప్)

ఆదిపురుష్ – రూ.135.04 కోట్లు (యావరేజ్)

సలార్ పార్ట్ 1 – రూ.153.84 కోట్లు (బ్లాక్‌బస్టర్)

కల్కి 2898 ఏడీ – రూ.294.25 కోట్లు (బ్లాక్‌బస్టర్)

పైన పేర్కొన్న గణాంకాలను బట్టి చూస్తే, ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు హిందీ ప్రేక్షకుల వద్ద గొప్పగా ఆదరణ పొందుతున్నాయని తెలుస్తోంది. ఈ డేటాను పరిగణనలోకి తీసుకుంటే స్పిరిట్, ఫౌజీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫౌజీ, స్పిరిట్‎లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. స్పిరిట్ వచ్చే ఏడాది నవంబర్ 14న విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించనుంది. ఫౌజీ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. వీటితో పాటు కల్కి 2898 ఏడీ పార్ట్ 2 కూడా ప్రభాస్ లైన్‌అప్ చిత్రాల జాబితాలో ఉంది.

Tags:    

Similar News