Prabhas vs Vijay: వార్-2ను కూలీ ఢీ కొట్టింది.. ఇప్పుడు విజయ్‌పై ప్రభాస్ సవాల్!
టాలీవుడ్, కోలీవుడ్ హీరోల మధ్య పోటీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాకు పోటీగా రజినీకాంత్ నటించిన కూలీ అదే రోజున రిలీజ్ అయింది.
Prabhas vs Vijay: వార్-2ను కూలీ ఢీ కొట్టింది.. ఇప్పుడు విజయ్‌పై ప్రభాస్ సవాల్!
టాలీవుడ్, కోలీవుడ్ హీరోల మధ్య పోటీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాకు పోటీగా రజినీకాంత్ నటించిన కూలీ అదే రోజున రిలీజ్ అయింది. ఆగస్టు 14న విడుదలైన ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కూలీపై భారీ అంచనాలు ఉండటంతో వార్-2 కలెక్షన్లకు దెబ్బ తగిలింది. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం, కూలీ లేకపోయి ఉంటే వార్-2 ఓపెనింగ్స్ మరింత బలంగా ఉండేవని అంటున్నారు.
ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రభాస్ సినిమా రాజాసాబ్ కు ఎదురవుతోంది. ఎందుకంటే 2026 జనవరి 9న విడుదల కానున్న ప్రభాస్ ది రాజాసాబ్ కు, తమిళ స్టార్ విజయ్ నటించిన జననాయగన్ పోటీగా రానుంది.
విజయ్ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి బిజినెస్ చేసుకోనుందని ట్రేడ్ టాక్. అయితే ప్రభాస్ సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్‌తో వస్తాయి. వార్-2 ను కూలీ అడ్డుకున్నట్లే.. ఈ సారి ప్రభాస్ రాజాసాబ్ విజయ్ జననాయగన్ ను ఢీ కొడుతుందని టాలీవుడ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ప్రభాస్ కు యాంటీ ఫ్యాన్స్ చాలా తక్కువ. అందువల్ల తెలుగులో యూనానిమస్‌గా సపోర్ట్ లభించే అవకాశం ఉంది. కానీ విజయ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఆయన సినిమాలు తెలుగులోనూ బాగా వసూలు చేస్తాయి. అయితే ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే విజయ్ సినిమా నిలబడటం కష్టమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.