Prabhas: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. మే నెల నుంచి..

Prabhas: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’, ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి భాగంలో ‘ది రాజాసాబ్‌’, ద్వితీయార్ధంలో ‘ఫౌజీ’ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Update: 2025-02-23 07:31 GMT

Prabhas: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’, ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి భాగంలో ‘ది రాజాసాబ్‌’, ద్వితీయార్ధంలో ‘ఫౌజీ’ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ దాదాపు ముగింపు స్టేజ్‌కి చేరుకున్న నేపథ్యంలో ప్రభాస్‌ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ ‘స్పిరిట్‌’ పై ఫోకస్‌ పెట్టనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సందీప్‌ వంగ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా స్పిరిట్‌ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘స్పిరిట్‌’ ప్రీప్రొడక్షన్‌ పనులు పూర్తి కాగా, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సినిమా కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన డైలాగ్‌ వెర్షన్‌ కూడా పూర్తయింది. ఇటీవలే నిర్మాత భూషణ్‌కుమార్‌ ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభమవుతుందని ప్రకటించినా, ప్రభాస్‌ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో అది ఆలస్యమైంది. తాజా సమచారం ప్రకారం స్పిరిట్ మూవీ షూటింగ్ మే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించను్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రష్మిక మందన్నా లేదా మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనదైన ముద్రవేసిన సందీప్‌ రెడ్డి వంగా, ‘స్పిరిట్‌’ ను అంతకుమించిన స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తన స్టైల్‌కి తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్ మేళవించిన పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేశారని సమాచారం.

కాగా స్పిరిట్‌ మూవీని వచ్చే ఏడాది తొలి భాగంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. బౌండ్‌ స్క్రిప్ట్‌ ఇప్పటికే సిద్ధంగా ఉండటంతో, సందీప్‌ రెడ్డి వంగా ఆలస్యం చేయకుండా చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తుననట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఇండియన్‌ ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News