Prabhas : హోంబళేతో మూడు సినిమాలకు ప్రభాస్ డీల్.. కారణం స్వయంగా చెప్పిన 'డార్లింగ్'!

Prabhas : పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు.

Update: 2025-07-18 02:53 GMT

Prabhas : హోంబళేతో మూడు సినిమాలకు ప్రభాస్ డీల్.. కారణం స్వయంగా చెప్పిన 'డార్లింగ్'!

Prabhas : పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. కానీ ప్రభాస్ అలా పడితే పడినట్లు ఎవరికీ డేట్స్ ఇవ్వడు. ప్రభాస్‌కు సినిమా కథ, తన పాత్రతో పాటు ఏ బ్యానర్‌ లో పని చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. చాలా ఆలోచించి నిర్మాతలని ఎంపిక చేసుకునే ప్రభాస్ హోంబళే ఫిలిమ్స్ ‌తో ఏకంగా మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు.

అవును ప్రభాస్ హోంబళే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థతో ఏకంగా మూడు సినిమాలకు సంతకం చేశాడు. సినిమా కథ, దర్శకుడు ఎవరనేది కూడా ఆలోచించకుండా ఒకేసారి మూడు సినిమాలకు సంతకం చేశాడు. ఈ మూడు సినిమాలు రాబోయే మూడు లేదా నాలుగేళ్లలో విడుదల కానున్నాయి. తాను ఎందుకు హోంబళేతో మూడు సినిమాలకు ఒకేసారి సంతకం చేశాడో స్వయంగా ప్రభాస్ వెల్లడించాడు.

ప్రభాస్ హోంబళేతో ఒకేసారి మూడు సినిమాలకు సంతకం చేయడానికి నిర్మాత విజయ్ కిరగందూర్ కారణమట. "విజయ్ కిరగందూర్ తన సినిమాల కోసం పనిచేసే వారిని చూసుకునే విధానం, వాళ్ళని కేర్ చేసే పద్ధతి నాకు బాగా నచ్చింది. ఆయన కూడా నా లాంటి వాడే. తన చిన్ననాటి స్నేహితులను ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటాడు. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటాడు. బయటికి వెళ్ళడానికి ఇష్టపడడు" అని ప్రభాస్ చెప్పాడు.

ఇవన్నీ కాకుండా, విజయ్ కిరగందూర్ చాలా సింపుల్‌గా, అత్యాశ లేకుండా ఉంటాడు అని ప్రభాస్ అన్నాడు. "సలార్ సినిమా తర్వాత విజయ్ కిరగందూర్ మా కుటుంబ సభ్యుడిలా మారిపోయాడు. నాకూ తనకూ ఉన్న సన్నిహిత్యం వల్ల మా ఇద్దరి మధ్య సహజంగానే ఒక కనెక్షన్ ఏర్పడింది. ఇదే కారణంతో నేను తనతో కలిసి మూడు సినిమాలకు సంతకం చేశాను" అని ప్రభాస్ వివరించాడు.

హోంబళే ఫిలిమ్స్ నిర్మించిన 'సలార్' సినిమాలో ప్రభాస్ నటించాడు. ఆ తర్వాత ఒకేసారి మూడు సినిమాలకు సంతకం చేశాడు, వాటిలో ఒకటి సలార్ 2. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో కూడా ప్రభాస్ హోంబళే బ్యానర్‌లోనే నటించనున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ఒక సినిమాను హోంబళే నిర్మించే అవకాశం ఉంది.

Tags:    

Similar News