UV Creations: యువి క్రియేషన్స్ పై వస్తున్న ట్రోల్స్ కి రెస్పాండ్ అయిన ప్రభాస్...

UV Creations: రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కి మధ్య మంచి స్నేహం ఉంది...

Update: 2022-03-16 13:30 GMT

UV Creations: యువి క్రియేషన్స్ పై వస్తున్న ట్రోల్స్ కి రెస్పాండ్ అయిన ప్రభాస్...

UV Creations: రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కి మధ్య మంచి స్నేహం ఉంది. నిజానికి ఒక రకంగా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కు హోమ్ బ్యానర్ లాగా మారిపోయిన సంగతి తెలిసిందే. కానీ గత కొంత కాలంగా అభిమానులు యు.వి.క్రియేషన్స్ ని సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలిసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు ప్రభాస్.

అభిమానులు యు.వి.క్రియేషన్స్ పైన వేలెత్తి చూపించడం ట్రోల్ చేయటం తనకి ఏమాత్రం నచ్చడం లేదని అన్నారు ప్రభాస్. "నేనెప్పుడూ మరో హీరో గురించి మాట్లాడలేదు. మిగతా వారిని కూడా మాట్లాడద్దు అని చెప్పాను. కానీ ఈ మధ్య యు.వి.క్రియేషన్స్ ను కొందరు బాగా ట్రోల్ చేస్తున్నారు. అయినా పర్వాలేదు. అది నా స్నేహితుడి బ్యానర్.

నా సినిమా గురించి నేను పబ్లిసిటీ చేయను కాబట్టి వాళ్ళయినా సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉండాలి" అని అన్నారు ప్రభాస్. ప్రభాస్ కి మంచి స్నేహితులు అయిన వంశీ మరియు ప్రమోద్ యువి క్రియేషన్స్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ పై ప్రభాస్ మిర్చి, సాహో మరియు రాధే శ్యామ్ వంటి సినిమాలలో నటించారు.

Tags:    

Similar News