Prabhas-Prasanth varma: బ్రహ్మరాక్షసుడిగా రెబల్ స్టార్.. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబో ఫిక్స్..
హనుమాన్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు.
బ్రహ్మరాక్షసుడిగా రెబల్ స్టార్.. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబో ఫిక్స్..
Prabhas-Prasanth varma: హనుమాన్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు. దీంతో బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రణ్‌వీర్ సింగ్‌తో బ్రహ్మరాక్షస్ అనే ప్రాజెక్ట్ కూడా చేయాలని అనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే మళ్లీ బ్రహ్మరాక్షస్ పై ఫోకస్ పెట్టిన ప్రశాంత్.. ఈ సినిమాను ప్రభాస్‌తో చేయాలని ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.
రణ్‌వీర్‌తో కలిసి బ్రహ్మరాక్షస్ అనే సినిమా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ ఫొటో షూట్ కూడా చేశారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్టును ప్రభాస్‌తో కలిసి చేయనున్నట్టు సినీ వర్గాల టాక్. ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో సినిమా ఉండబోతుందని ముందు నుంచే ఇండస్ట్రీలో గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు అది నిజమవుతుంది. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారని తెలుస్తోంది.
హనుమాన్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ వరస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ప్రభాస్‌తో మూవీకి సిద్ధమవుతున్నారు ప్రశాంత్ వర్మ. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని ప్రచారం జరుగుతోంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమా లుక్ టెస్ట్‌లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే లుక్ టెస్ట్ ఫినిష్ అవుతుందని.. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ లుక్ ను కూడా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతోంది..? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి సినిమాలు ఉన్నాయి.