Prabhas: నెక్స్ట్ సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్..

Prabhas: ఏడాది లో నాలుగు సినిమాలు పూర్తి చేయబోతున్న ప్రభాస్

Update: 2023-04-19 04:00 GMT

Prabhas: నెక్స్ట్ సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్..

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా బోలెడు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాదిలోనే ప్రభాస్ నాలుగు సినిమాల షూటింగ్ పూర్తి చేయబోతున్నారట. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా ని జూన్ 16న విడుదల చేయబోతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమా కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలవుతుంది అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించేసింది.

అంతేకాకుండా మారుతి డైరెక్ట్ చేస్తున్న "రాజా డీలక్స్" సినిమా షూటింగ్ కూడా కొంత పూర్తయింది. ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నారు ప్రభాస్. ఇవి మాత్రమే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్ట్ కే" సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది లోపల పూర్తి చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట.

ఇక వచ్చే ఏడాది సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్" మరియు "పటాన్" ఫేమ్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ కూడా పూర్తిచేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చూస్తూ ఉంటే ప్రభాస్ అతి త్వరలోనే వరుస సినిమా విడుదలలతో అభిమానులకి సర్ప్రైజులు ఇవ్వబోతున్నట్లు చెప్పుకోవచ్చు. అయితే "ఆది పురుష్" మరియు "సలార్" సినిమాలకి తప్ప మిగతా సినిమాల విడుదల తేదీలు ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమాల కోసం ప్రభాస్ అభిమానులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News