Pooja Hegde: వెబ్ సిరీస్‌లలో నటించనున్న బుట్టబొమ్మ
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. కానీ ప్రస్తుతం ఈ అమ్మడుకు బ్యాడ్ టైం నడుస్తోంది.
వెబ్ సిరీస్‌లలో నటించనున్న బుట్టబొమ్మ
Pooja Hegde: పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. కానీ ప్రస్తుతం ఈ అమ్మడుకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆమె సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. దాంతో పూజా కెరీర్ డౌన్ అయింది. దీంతో ఈ అమ్మడు వెబ్ సిరీస్‌ల్లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడుస్తుందని టాక్ వినిపిస్తోంది.
2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన పూజా ఫొటోలు చూసి దర్శకుడు మిస్కిన్ ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో 2012లో వచ్చిన ముగమూడి సినిమాతో పూజా తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది. అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా తమిళ సినిమా నుంచి తప్పుకుంది. ఇక 2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నాగచైతన్యతో జతకట్టింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన మొహంజదారో అనే హిందీ చిత్రంలో నటించింది. మిగతా భాషల్లో పెద్దగా నటించకపోయినా తెలుగులో వరుసగా సినిమా చేసి మెప్పించింది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు పూజా. అల వైకుంఠపురంతో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్నారు . అయితే ఈ మధ్య ఈ అమ్మడికి హిట్ దక్కడం లేదు. ఇక తెలుగు సినిమాల్లో కనిపించక సుమారు మూడేళ్లు అవుతోంది. ఆమె చివరిసారిగా ప్రభాస్ రాధేశ్యామ్‌లో కనిపించారు ఆతర్వాత వెంకటేష్. వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. చివరిగా సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీ కా జాన్ తర్వాత హిందీలో దేవా అనే సినిమాలో నటించించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
ప్రస్తుతం సూర్య 44 సినిమా రెట్రోలో పూజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లల్లో నటించారు. ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడుస్తుందని టాక్. ఈ వెబ్ సిరీస్‌ను డిమాంటి కాలనీ, కోబ్రా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరి వెబ్ సిరీస్‌లలో అయినా పూజా రాణిస్తారేమో చూడాలి.