Manchu Family: మోహన్ బాబు ఫిర్యాదు.. మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు
Manchu Family: మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
Manchu Family: మోహన్ బాబు ఫిర్యాదు.. మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు
Manchu Family: మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రెండు రోజులు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబుపై మంచు మనోజ్, మనోజ్ ఆయన భార్యపై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదు మనోజ్ ఆయన భార్యపై పోలీసులు కేసు పెట్టారు.
అసలు ఏం జరిగింది?
మంచు మనోజ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని డిసెంబర్ 8న మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై మోహన్ బాబు టీమ్ స్పందించింది. మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల విషయంలో ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. అసత్యాలు ప్రచారాలు చేయవద్దని కోరింది. అయితే అదే రోజున సాయంత్రం హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మనోజ్ చికిత్స తీసుకున్నారు. మనోజ్ ఒంటిపై గాయాలున్నాయని ఈ పరీక్షల్లో తేలిందని తెలుస్తోంది. డిసెంబర్ 09న ఉదయం జల్ పల్ లోని మనోజ్ నివాసం వద్ద భారీగా బౌన్సర్లను మోహరించారు. విష్ణు తరపున ఈ బౌన్సర్లు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కూడా తన తరపున బౌన్సర్లను పిలిపించారు. అయితే మనోజ్ బౌన్సర్లను ఇంటిలోపలికి అనుమతించలేదు.
మనోజ్ పై రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ పై మోహన్ బాబు రాచకొండ సీపీకి డిసెంబర్ 9న లేఖ రాశారు. మనోజ్ కారణంగా తనకు, తన భార్య ప్రాణాలకు ముప్పుందని ఆయన ఆ లేఖలో చెప్పారు.డిసెంబర్ 8న తన నివాసంలో మనోజ్ అనుచరులు అలజడి సృష్టించి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. సోమవారం తెల్లవారుజామున కూడా తన ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించానని ఆయన ఆ లేఖలో తెలిపారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు తన నివాసంలోకి మనోజ్ అనుచరులు చొరబడ్డారని ఆయన ఆ లేఖలో తెలిపారు.తనకు తగిన భద్రత కల్పించాలని ఆయన ఆ లేఖలో కోరారు.
తండ్రి ఫిర్యాదుపై స్పందించిన మనోజ్
తనపై, తన భార్య మౌనికపై తన తండ్రి మోహన్ బాబు లేవననెత్తిన అంశాలు తప్పని ఆయన చెప్పారు. తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. కుటుంబ అంశాలను ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని మనోజ్ సోషల్ మీడియాలో కోరారు.