అల్లు అర్జున్‌తో ఫొటో షూట్ ఈవెంట్.. రద్దు కావడంతో ఆందోళనకు బన్నీ ఫ్యాన్స్
Allu Arjun: తోపులాటలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు...
అల్లు అర్జున్‌తో ఫొటో షూట్ ఈవెంట్.. రద్దు కావడంతో ఆందోళనకు బన్నీ ఫ్యాన్స్
Allu Arjun: హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌తో ఫొటో షూట్ ఈవెంట్ ప్లాన్ చేశారు ఆర్గనైజర్లు. అయితే.. ఎన్ కన్వెన్షన్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో.. ప్రోగ్రామ్‌ను రద్ద చేశారు. దీంతో ఆందోళనకు దిగిన బన్నీ ఫ్యాన్స్.. గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అభిమానులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు అభిమానులు గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.