Peddi: రామ్ చరణ్ కోసం జానీ మాస్టర్ స్టెప్పులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘పెద్ది’ కోసం అద్భుతమైన మేకోవర్‌తో సిద్ధమవుతున్నారు. బుచ్చి బాబు సన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

Update: 2025-08-27 12:43 GMT

Peddi: రామ్ చరణ్ కోసం జానీ మాస్టర్ స్టెప్పులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘పెద్ది’ కోసం అద్భుతమైన మేకోవర్‌తో సిద్ధమవుతున్నారు. బుచ్చి బాబు సన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్, రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తాయి.

తాజాగా మైసూర్‌లో ఓ భారీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ మాస్ సాంగ్‌కు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ పాటలో వెయ్యికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటుండగా, రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అద్భుతంగా అలరిస్తున్నారని యూనిట్ చెబుతోంది. ఈ పాట సినిమాకి హైలైట్ కానుందని కూడా తెలుస్తోంది.

వినాయక చవితి వాతావరణంలో దేశమంతా పండుగ మూడ్‌లో మునిగిపోతుండగా, ‘పెద్ది’ టీమ్ మాత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘పెద్ది’ మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కానుంది.


Tags:    

Similar News