Pawan Kalyan : రాజకీయాల తర్వాత పవన్ కళ్యాణ్ ఊచకోత ఖాయం..ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఎప్పుడంటే?

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు కొద్దిగా విరామం ఇచ్చారు.

Update: 2025-11-24 06:50 GMT

Pawan Kalyan : రాజకీయాల తర్వాత పవన్ కళ్యాణ్ ఊచకోత ఖాయం..ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఎప్పుడంటే?

Pawan Kalyan : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు కొద్దిగా విరామం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాలు కూడా మధ్యలో ఆగిపోయాయి. అయితే ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా పవన్ తన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు విడుదల కాగా, ఇప్పుడు మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలపై నిర్మాత ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆపిన మూడు సినిమాల్లో రెండు ఇప్పటికే థియేటర్లలోకి వచ్చాయి. మొదట హరి హర వీర మల్లు సినిమా విడుదలై సాధారణ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మిగిలి ఉన్నది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే. ఎన్నికలకు ముందు ఈ సినిమా షూటింగ్ కొద్దిగా మాత్రమే మొదలైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి ఎప్పుడు విరామం దొరికితే అప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లి ఒక పాట చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల గురించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవి ఇటీవల ఆంధ్రా కింగ్ తాలూకా ఈవెంట్‌లో మాట్లాడారు. ఆయన మాటలు పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత రవి ప్రకటించారు. "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అద్భుతంగా వస్తోంది. ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణాలోని ప్రతి సెంటర్‌లోనూ సూపర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గత చిత్రం ఓజీ కంటే ఈ సినిమా రెండింతలు ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానుల కోసమే ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం" అని రవి కొనియాడారు. ఈ వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేశాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోకు ఒక చరిత్ర ఉంది. గతంలో పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ద్వయం రెండోసారి కలిసి సినిమా చేస్తుండటంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆశుతోష్ రాణా, రాశి ఖన్నాతో పాటు మరికొందరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News