OG: పండ‌గ చేసుకోండి.. ఓజీ నుంచి క్రేజీ అప్‌డేట్..!

OG: ప‌వ‌న్ అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. రాజ‌కీయాల్లో బిజీగా మారిన తర్వాత ప‌వన్ వెండి తెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

Update: 2025-05-13 10:03 GMT

OG: పండ‌గ చేసుకోండి.. ఓజీ నుంచి క్రేజీ అప్‌డేట్

OG: ప‌వ‌న్ అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. రాజ‌కీయాల్లో బిజీగా మారిన తర్వాత ప‌వన్ వెండి తెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అయితే ప్ర‌స్తుతం చేతిలో ఉన్న సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు ప‌వ‌న్‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒక‌టి.

సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ ఇప్ప‌టికే చిత్రంపై భారీగా అంచ‌నాలను పెంచేసిన విష‌యం తెలిసిందే. ఆ తరవాత విడుదలైన గ్లింప్స్ వీడియోతో టాలీవుడ్‌ను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి ఈ సినిమాను గ‌తేడాది విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా మారడంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఇటీవల కొన్ని వారాలుగా షూటింగ్ నిలిచిపోయిన ఈ చిత్రం తిరిగి సెట్స్ పైకి వచ్చేసింది. కెమెరా టీమ్‌లోని ఒక సభ్యుడు ట్విట్టర్ ద్వారా ‘‘ఈ రోజు OG షూటింగ్ తిరిగి మొదలైంది’’ అంటూ ఓ ట్వీట్ చేయగా, అదే ట్వీట్‌ను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా రీట్వీట్ చేస్తూ ‘‘మళ్లీ మొదలైంది.. ఈసారి మోగిపోద్ది’’ అంటూ పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం రేపింది. దీంతో '#OGisBack' అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో ‘పంజా’ సినిమాలో కొద్దిగా గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన పవన్, ఈసారి పూర్తి స్థాయి బ్రూటల్ గ్యాంగ్‌స్టర్‌గా తెరపై సందడి చేయనున్నారు. అంతే కాదు, ఈ చిత్రంలో పవన్ మూడు విభిన్న పాత్రలతో కనిపించబోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News