పవర్ స్టార్ న్యూ లుక్ అదిపోయిందంటూ..ఫ్యాన్స్ సంబరాలు

Update: 2020-02-07 15:56 GMT
Pawan Kalyan

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు రాజకీయాల్లో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లు సినిమాలకు విరామం ఇచ్చిన ఆయన పింక్ రీమేక్ తో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సగం వరకు పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో లాయర్ గా పవన్ నటిస్తున్నారు. పవన్ లుక్ లీక్ కావడంతో అభిమానలు పండగ చేసుకున్నారు.

కాగా.. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉండటంతో పవన్ న్యూ లుక్ రివీల్ అయిపోయింది. సినిమా షూటింగ్ పాల్గొనడం మరుసటి రోజే కార్యకర్తలు, నేతలతో సమావేశంతో లుక్ బయటపడింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశానికి పవన్ హాజరైయారు. దీంతో లుక్ రివీల్ అయింది. గడ్డం.. ఒత్తైన జుట్టు, మీసాలతో కనిపించిన పవన్ తాజా లుక్ లో గడ్డం లేకుండా సరికొత్తగా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కెమెరాలతో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ సినిమాను వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్రత్నిస్తుంది.


Tags:    

Similar News